లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం : ఈటల - etela latest comments
🎬 Watch Now: Feature Video


Published : Dec 28, 2023, 7:06 PM IST
Etala Rajender on Lok Sabha Election 2024 : వచ్చే ఏడాది ఏప్రిలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలో ఏ ఒక్క స్కామ్ లేకుండా పాలన సాగించిన ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీపై కాంగ్రెస్ నాయకులు ఎంత విష ప్రచారం చేసినా ఉత్తర తెలంగాణ ప్రజానీకం తమ పార్టీకి అండగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. వందేళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి కాబోతుందని తెలిపారు.
తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వచ్చిందని చెప్పారు. మోదీ హయాంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తమ నాయకుడు అనుకుంటూ చెపుతున్న వారు మోదీ అని అన్నారు. వారు చేస్తున్న అభివృద్ధిని చూసి నేడు భారత దేశాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని ఈటల పేర్కొన్నారు.