మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక
🎬 Watch Now: Feature Video
Published : Nov 9, 2023, 5:15 PM IST
Environmental Experts about Medigadda Barrage : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ ప్రమాదాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పర్యావరణ, నీటి, భూగర్భ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగింది కొద్ది ప్రమాదమే కానీ, భవిష్యత్‌లో తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సోమాజిగూడలోని ఏర్పాటు చేసిన ప్రెస్‌క్లబ్ సమావేశంలో పర్యావరణ, నీటి, భూగర్భ నిపుణులు నరసింహారెడ్డి, దిలీప్‌రెడ్డి, బి.వి.సుబ్బారావు పాల్గొన్నారు. మేడిగడ్డ ప్రమాదాలకు గల కారణాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Meeting on Medigadda Barrage Issue : నీటి ఉద్ధృతి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే బ్యారేజీ నిర్మాణం చేశారని చెప్పారు. స్థానిక భౌగోళిక లక్షణాలు, డిజైన్ లోపాలు, నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుల పరిసరాల్లో కొనసాగుతున్న బొగ్గు తవ్వకాల మధ్య ఉన్న విషయాలను వివరించలేదని అన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు విచారణ కమిటీ వేయాలేదని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. వెంటనే విచారణ కమిటీ వేసి నిజాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్నీ వివరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని ఉద్ఘాటించారు.