Engineering Student Missing in Rangareddy District : ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అదృశ్యం.. విద్యార్థి సంఘాల ఆందోళన - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 6:21 PM IST
Engineering Student Missing in Brilliant College : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి కనబడకపోవడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు డిప్లమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. రోజూ కళాశాల వెళ్లే విద్యార్థి వసతి గృహం నుండి వారం రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. ఎన్నిసార్లు కళాశాలలో ఫిర్యాదు చేసిన సరైన సమాధానం ఇవ్వలేదంటూ విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామన్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థి అదృశ్యానికి కారణం కళాశాల యాజమాన్యం అంటూ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థి అదృశ్యానికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థులు కళాశాల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వారం రోజుల క్రితం బయటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్లినట్లు యాజమాన్యం తెలిపిందని తల్లిదండ్రులు తెలిపారు.
TAGGED:
Enganeer Student Missing