కిరాణా షాపులో ఏనుగు 'దొంగతనం'!.. షట్టర్ ధ్వంసం చేసి అరటిపళ్లు, కూరగాయలు తిన్న గజరాజు - ఏనుగు దాడి వీడియో కర్ణాటక
🎬 Watch Now: Feature Video
Elephant Attack Video : కర్ణాటకలోని ఓ కిరాణా షాప్‌లో అడవి ఏనుగు 'దొంగతనం' చేసింది. దుకాణం షట్టర్‌ను పూర్తిగా ధ్వంసం చేసి.. అందులోని అరటిపళ్లు, కూరగాయలను ఆరగించింది. చామరాజనగర్‌లోని పుణేజనూరు-అసనూర్ జాతీయ రహదారి పక్కనున్న షాప్‌పై ఏనుగు ఇలా దాడి చేసింది. ఈ దుకాణం వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిందని తెలిసింది. ఏనుగు దాడిపై సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడి నుంచి గజరాజును తరిమేశారు. ఏనుగు షాప్‌లో ఉన్న సామగ్రిని కూడా నాశనం చేసిందని స్థానికులు తెలిపారు. కాగా ఏనుగు దాడిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
యువకులకు చుక్కలు చూపించిన ఏనుగు.. సెల్ఫీ కోసం వెళ్తే ఛేజ్ చేసి..
నెల రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగులు హల్చల్ చేశాయి. సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల వెంట పడ్డాయి. దీంతో వాటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు.. పరుగు ప్రారంభించారు ఆ ముగ్గురు. లఖీంపుర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.