Edupayala Temple Closed : ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత - Police Protection For Edupayala Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 2:42 PM IST

Edupayala Temple Closed in Medak : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల సింగూర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ఈ వరద ప్రవాహం చేరడంతో మంజీరా పరివాహక ప్రాంతం ఉప్పొంగుతోంది. మెదక్ జిల్లాలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టు అయిన వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టు ముట్టేసింది. తెల్లవారుజామున గర్భగుడిలో ఆలయ అర్చకులు అభిషేకం, అలంకరణ చేసిన తదనంతరం భద్రత దృష్ట్యా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజ గోపురంలో ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంజీరా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద ప్రవాహం తగ్గే వరకు భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.