EC Issues Notice to Telangana Pragathi Bhavan : ప్రగతిభవన్ సాక్షిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. బీఆర్ఎస్​పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు - బీఆర్ఎస్​పై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 4:52 PM IST

EC Issues Notice to Telangana Pragathi Bhavan : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారక భవనమైన ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. కోడ్ అమ‌ల్లో ఉన్న సంద‌ర్భంలో.. ప్ర‌గ‌తిభ‌వ‌న్​ను పార్టీ పనుల కోసం వినియోగించ‌కూడ‌దు. అయితే.. ఈ నిబంధ‌న‌ను ఉల్లంఘించిన‌ట్లుగా ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తన  బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు ఇస్తున్నారని.. ఇది ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదులో తెలిపింది.

Pragathi bhavan Latest News : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సైతం రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని వెల్లడించింది. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందిస్తూ.. ఏం చేస్తున్నార‌న్న విష‌యంపై వివరణ తీసుకోవాలని జీహెచ్ఎమ్​సీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రగతిభవన్‌లో రోజువారీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్న ఓ ఉద్యోగికి నోటీసు పంపినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.