ఫుల్​గా మందుకొట్టి నాగుపాముతో ఆటలు.. కాసేపటికే మృతి - తాగిన మత్తులో పాముతో విన్యాసం బిహార్​ యువకుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 5, 2023, 3:14 PM IST

ఫుల్​గా మందుకొట్టి ఓ యువకుడు నాగు పామును ముద్దాడాడు. దాన్ని మెడలో వేసుకుని విన్యాసాలు చేసాడు. దీంతో ఆ పాము కాటు వేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాదా జిల్లాలోని గోవింద్​పుర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో దిలీప్​ యాదవ్​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడు ఫుల్​గా మద్యం తాగి.. పామును ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఆ సర్పాన్ని మెడలో వేసుకున్నాడు. అక్కడే ఉన్న ఓ ఆలయం ముందు శిరస్సు వంచి దండాలు పెట్టాడు. తనను క్షమించమని దేవుడిని కోరాడు. ఆ తర్వాత మెడలో పాముతో కాసేపు చిందులేశాడు. అయితే, ఈ తాగుబోతు వేషాలు చూసి అక్కడ గుమిగూడిన జనం.. పామును వదిపెట్టాలని కోరారు. కానీ దిలీప్​ అవేమీ పట్టించుకోలేదు. కాసేపటికి తర్వాత పాము కాటువేయడం వల్ల​ కిందపడిపోయాడు. దీంతో అతడిని వెంటనే గోవింద్​పుర్​ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దిలీప్​ యాదవ్​ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఇక, ఈ ఘటనపై స్థానికులు తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. చనిపోయిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. దిలీప్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.