షిరిడీ ఆలయానికి భక్తుడు విరాళం - బంగారు పుష్పం అందజేత - tvs apachi 310 byke
🎬 Watch Now: Feature Video
Published : Dec 27, 2023, 8:11 PM IST
Donations to Shirdi Saibaba Temple: షిరిడీ సాయిబాబాకు భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఈరోజు ఒడిశాకు చెందిన ఓ భక్తుడు బంగారు పుష్పం సమర్పించగా, టీవీఎస్ కంపెనీ డీలర్ ఓ ద్విచక్రవాహనాన్ని సాయినాథుడికి అందజేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన భక్తుడు శంభునాథ్ సవాయ్ షిరిడీ సాయినాథుడికి కానుక సమర్పించారు. దత్త జయంతి సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు 82.870 గ్రాముల బంగారు పుష్పాన్ని విరాళంగా అందజేశారు. 4 లక్షల 77 వేల రూపాయల విలువైన బంగారు పుష్పాన్ని సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లేకు అందజేశారు.
టీవీఎస్ కంపెనీ అపాచీ 310 స్పోర్ట్స్ బైక్‌కు సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కోపర్‌గావ్‌లోని TVS కంపెనీ డీలర్ వీరేంద్ర భండార్కర్ దాదాపు మూడున్నర లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని ఆలయానికి అందజేశారు. ఇప్పటివరకు తాము 10 మోటార్ సైకిళ్లు, ఒక త్రీవీలర్ సాయినాథుడికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కానుకలు సమర్పించన భక్తులకు సాయిబాబా విగ్రహం, శాలువాతో ఆలయ సిబ్బంది సత్కరించారు.