అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల డ్రగ్స్​ను పట్టించిన శునకం - దిల్లీ ఎయిర్​పోర్టులో విదేశీ కరెన్సీ కలకలం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 21, 2022, 2:03 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

ఓ శునకం సహాయంతో ఏకంగా రూ. 5.35 కోట్ల విలువ చేసే డ్రగ్స్​ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటన తమిళనాడు చెన్నైలోని విమానాశ్రయంలో జరిగింది. ఉగాండకు చెందిన అడిస్ అబాబా అనే మహిళ బ్యాగ్​లో 1542 గ్రాముల మెథాక్వలోన్, 644 గ్రాముల హెరాయిన్​ లభ్యమైంది. అనంతరం కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీని పట్టుకున్నారు సీఐఎస్ఎఫ్ అధికారులు. అతడి ట్రాలీ బ్యాగ్‌లో అక్రమంగా నగదు తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న విదేశీ కరెన్సీని సౌదీ రియాల్​గా గుర్తించారు అధికారులు. దీని విలువ దాదాపు రూ.16 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. అతడు భారతదేశానికి చెందిన షేక్ పప్పు ఖాన్​గా గుర్తించారు. దిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న సమయంలో అనుమానం రావడం వల్ల అతడిని తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.