Doctor Lohit Interview on Hepatitis C : రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న హైపటైటిస్-సి.. ఈ లక్షణాలు మీలోనూ ఉన్నాయా..? - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 24, 2023, 11:26 AM IST
Doctor Lohit Interview on Hepatitis C : రాష్ట్రంలో హెపటైటిస్-సి (Hepatitis C) చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇది తీవ్రమైన కాలేయ వ్యాధికి దారి తీస్తోందని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలో వైద్య పరీక్షలు చేసిన ప్రతి 235 మందిలో ఒకరికి హెపటైటిస్-సి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఇంతకీ అసలు హెపటైటిస్ సి ఎలా వస్తుంది..? ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరగటానికి కారణం ఏమిటి..? హెపటైటిస్ సి సోకిన వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి..? దీనికి సంబంధించి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై నిమ్స్ ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు డాక్టర్ లోహిత్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
"హెపటైటిస్-బీలో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో.. అలాంటివే హెపటైటిస్-సిలో కూడా రావొచ్చు. లక్షణాలు అనేవి ఏం తెలియకుండా హెల్త్ చెకప్‌లో బయటపడొచ్చు. పేషెంట్‌కు రక్తవాంతి రావడం ఇలా కూడా బయటపడొచ్చు. లివర్ క్యాన్సర్ ద్వారా కూడా ఈ లక్షణాలు అనేవి కనిపించొచ్చు." -డాక్టర్ లోహిత్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు, నిమ్స్ ఆసుపత్రి