దుండగుల దాడిలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి - రాకేశ్ బంగారం డబ్బు దోచుకెళ్లిన దుండగులు
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 5:51 PM IST
Died Young Man Robbery Attack in Warangal : వరంగల్ బస్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేసి ఒంటి మీద ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలతో పాటు డబ్బును దుండగులు దోచుకెళ్లారు. వరంగల్ బస్టాండ్ సమీపంలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు రాకేష్‌ను అడ్డగించి ముగ్గురు కలిసి తనపై దాడికి దిగారు.
Death Of A Young Man Attack By Robbers : ఈ ఘటనలో రాకేశ్ తల భాగంలో తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన రాకేష్‌ను స్థానికులు దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రాకేష్ మృతి చెందాడు. దాడి జరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ మృతుడి తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.