సతీసమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న డీజీపీ రవి గుప్తా - యాదాద్రిని దర్శించుకున్న డీజీపీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 7:11 PM IST

DGP visits Yadadri Lakshmi Narasimha Swamy Temple : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి, అడిషనల్ డీజీపీ స్వామివారిని దర్శించుకున్నారు. డీజీపీ రవి గుప్తాకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం వేద మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అర్చకులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

Huge rush At Bhadradri Temple : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.