Devotional day celebrations in bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో కన్నులపండుగగా ఆధ్యాత్మిక ఉత్సవాలు - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Devotional day celebrations in bhadrachalam : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను అలంకరించడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. దేవాలయాల్లో వేదపారాయణం, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇందులో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో...రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. జూన్ రెండు నుంచి ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అధికారులు ఈరోజు ఆధ్యాత్మిక ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ముందుగా సీతారాముల ప్రచార రథంతో నగర సంకీర్తన చేశారు. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛరణలు, వివిధ వేషధారణలతో ప్రచారరథ ప్రదర్శన ఘనంగా సాగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండటంతోపాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలంటూ సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం వరకు ఆలయంలో ఉత్సవాలు ఏకధాటిగా జరుగుతాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.