Devotees Went Down Into Flowing Water Visited Lord Shiva : మోకాలి లోతు నీటిలో నడిచి.. శివయ్యను దర్శించుకున్న భక్తులు - నీటిలోకి దిగి శివుడిని దర్శించుకున్న భక్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 7:11 PM IST

Updated : Sep 11, 2023, 7:24 PM IST

Devotees Went Down Into Flowing Water Visited Lord Shiva : శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు చేరుకొని ప్రత్యేకపూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ శివాలయం(Sirichelma Shiva Temple ) .. భక్త జనసంద్రంగా మారింది. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక పూజలు చేశారు. 

Sirichelma Shiva Temple in Adilabad District : దూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన శివచెల్మ దేవాలయానికి తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే దారిలో మోకాలి లోతున నీరు ప్రవహిస్తున్నా.. కొంతమంది తాడు సాయంతో ప్రవాహాన్ని దాటి వెళ్లారు. మరికొంత మంది అక్కడ ఏర్పాటు చేసిన తెప్పల సాయంతో అక్కడికి చేరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి చేరుకున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అభిషేకప్రియుడికి పాలాభిషేకాలు చేసి తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం దాతలు అన్నదానం నిర్వహించారు.

Last Updated : Sep 11, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.