Delhi Jewellery Shop Robbery Viral Video : గన్‌లతో బెదిరించి జ్యువెలరీ షాప్‌లో చోరీ.. ఇటీవలే జైలు నుంచి వచ్చి.. - తుపాకీలతో బెదిరించి జ్యువెలరీ షాప్‌లో చోరీ
🎬 Watch Now: Feature Video
Published : Nov 1, 2023, 12:59 PM IST
Delhi Jewellery Shop Robbery Viral Video : దిల్లీ.. కరవాల్ నగర్‌లోని జ్యువెలరీ షాప్‌లో దొంగతనం కలకలం రేపింది. గన్‌లతో దుకాణంలోకి ప్రవేశించిన ముగ్గురు దుండగులు.. సిబ్బందిని బెదిరించి ఈ చోరీకి పాల్పడ్డారు. హెల్మెట్లు ధరించి మరీ దొంగతనం చేశారు. అయితే దుండగుల్లో ఇద్దరు ద్విచక్ర వాహనంపై పరారవ్వగా.. మరో వ్యక్తిని జ్యువెలరీ షాపు సిబ్బంది పట్టుకున్నారు. సిబ్బంది పట్టుకున్న నిందితుడిని ఫైజన్గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇప్పటికే నాలుగు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఫైజన్.. మళ్లీ దొంగతనం చేశాడని వెల్లడించారు. ఫైజన్ నుంచి ఒక పిస్టల్, 4 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటన అక్టోబరు 31వ తేదీన జరిగినట్లు తెలిపారు.
కొన్నిరోజుల క్రితం ఇలాంటి ఘటనే దేశ రాజధానిలోనే జరిగింది. తుపాకీతో బెదిరించి బంగారం దుకాణంలో రూ. 50 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. సమయ్పుర్ బాదలి పరిధిలోని శ్రీరామ్ జువెల్లర్స్ షాపులో ముగ్గురు దొంగలు హెల్మెట్లు ధరించి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణ సిబ్బంది, కొనుగోలుదారులు అందరూ చూస్తుండగా.. నిమిషాల్లోనే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ షాపులో దొంగతనం చేసిన తర్వాత మరో దుకాణంలోకి ప్రవేశించి.. 800 గ్రాముల బంగారాన్ని దొంగిలించారు. అందుకు సంబంధించిన వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.