దిల్లీవాసులకు ఊరట- మెరుగైన గాలి నాణ్యత, 387 పాయింట్లకు చేరిన ఏక్యూఐ! - దిల్లీలో మెరుగుపడ్డ గాలి నాణ్యత
🎬 Watch Now: Feature Video
By PTI
Published : Nov 28, 2023, 11:08 AM IST
Delhi AQI Improvement : దిల్లీలో వాయు నాణ్యత కాస్త మెరుగుపడింది. వర్షం కారణంగా, గాలి వేగం గంటకు 20 కిలోమీటర్ల వరకు ఉండటం వల్ల కాలుష్య కారకాలు వాతావరణం నుంచి కొంత వరకు తొలగిపోయాని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు 7.2 శాతం మేర వర్షపాతం నమోదైంది. అంతకుముందు రోజు 400 పాయింట్లుగా ఉన్న వాయు నాణ్యత సూచి-AQI తాజాగా 387 పాయింట్లకు చేరుకుందని పేర్కొన్నారు.
వాయు నాణ్యత మెరుగు పడినప్పటికీ దిల్లీలోని పలు ప్రాంతాలను పొగ మంచు తీవ్ర స్థాయిలో కప్పేసింది. ఈ నెలలో గత పది రోజులుగా దిల్లీలో తీవ్ర స్థాయిలో AQI నమోదైంది. అయితే దిల్లీలో ఈ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం పంటలను తగలబెట్టడమేనని.. ఈ చర్య ద్వారానే గత కొద్దిరోజులుగా 31 నుంచి 51 శాతం మేర గాలి నాణ్యత తగ్గుతూ వస్తుందని దిల్లీ ప్రభుత్వం, ఐఐటీ-కాన్పుర్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్ట్ తేటతెల్లం చేసింది.