'ధరణి'పై చర్చలకు అసలు కారణం ఏంటి? ప్రక్షాళన సాధ్యమేనా? - ధరణి పోరల్‌లో భూ సమస్యలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-12-2023/640-480-20269318-thumbnail-16x9-revanth-meet-dharani-portal.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 14, 2023, 10:41 PM IST
Debate on Dharani Portal Issues in Telangana : ఎడతెగని భూ వివాదాలు, ఏళ్లు గడుస్తున్నా తీరని ధరణి ఇక్కట్లు. రాష్ట్రంలో ఎంతోకాలంగా ఒడవని ముచ్చట ఇది. ఈ నేపథ్యంలోనే కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదట్లోనే ఈ విషయంలో గట్టిగా దృష్టి సారించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదట్నుంచి చెబుతున్నట్లే తన ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ధరణి ప్రక్షాళన, భూ వివాదాల పరిష్కారం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం. కోనేరు రంగారావు కమిటీ తరహాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు.
మరి ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న లోపాలేంటి? అన్ని సమస్యలకు పరిష్కారం అంటూ గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన ధరణి ఎందుకింతగా చర్చల్లో నలుగుతోంది. ప్రస్తుతం జరగాల్సిన మార్పులపై భూమి చట్టాలు, రెవెన్యూ నిపుణులు ఏమంటున్నారు? భూముల సమగ్ర సర్వే, రికార్డుల ఆధునీకరణ, పక్కాగా టైటిల్ హక్కుల కల్పన అన్నది రాష్ట్రంలో ఎంతోకాలంగా పెద్ద చిక్కుముడిగా ఎందుకు ఉంది? భూ వివాదాల చిక్కుముడుల్ని పరిష్కరించి, రెవెన్యూ సంస్కరణలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దాలంటే ఎలాంటి చర్యలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.