ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : దామోదర్ రాజనర్సింహా - ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించిన దామోదర
🎬 Watch Now: Feature Video
Published : Dec 10, 2023, 8:05 PM IST
|Updated : Dec 10, 2023, 10:29 PM IST
Damodar Raja Narasimha Started Two Assurances In Sangareddy : పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలంలోని జోగిపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను జిల్లా పాలన అధికారి శరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించి, మహిళలతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
50 Bed Govt Hospital Will Constructed In Vatapally : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ రెండు పథకాలను ప్రారంభించిందని వివరించారు. రాబోయే నాలుగు నెలల్లో మిగతా నాలుగు హామీలను అమలులోకి తెస్తామని చెప్పారు. ఆందోల్ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ తరపున తన పాత్ర ఉంటుందని దామోదర అన్నారు. త్వరలో వటపల్లి మండల కేంద్రంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తామని దామోదర రాజనర్సింహా తెలిపారు.