Cyber Security Course in Degree Level in Telangana : డిగ్రీ కళాశాలల్లో సైబర్ సెక్యూరిటీ కోర్సు - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 7:44 PM IST
|Updated : Sep 11, 2023, 8:00 PM IST
Cyber Security Course in Degree Level in Telangana : ఉపాధికి, సమాజానికి అవసరమయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో ప్రవేశపెడతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సు(Cyber Security Course)ను మంత్రి ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్బీ రూపొందించిన నివేదికను ఆమె ఆవిష్కరించారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.
New Course Interduce in Degree Colleges : మూల్యాంకనంపై ఐఎస్బీ ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యా మండలికి సూచించారు. సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీలోని.. నాలుగో సెమిస్టర్లో సైబర్ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లతో ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, ఐఎస్బీ ప్రతినిధులు పాల్గొన్నారు.