Cyber Crime SI Arrested in Drugs Case : డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం.. సైబర్ క్రైమ్ ఎస్సై అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు - డ్రగ్స్ కేసులో సైబర్ క్రైమ్ ఎస్సై రాజేందర్
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 1:19 PM IST
Cyber Crime SI Arrested in Drugs Case : సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సైని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న రాజేందర్ ఫిబ్రవరి నెలలో సైబర్ నేరంలో భాగంగా ముంబయి వెళ్లారు. అక్కడ సైబర్ మోసానికి పాల్పడిన నైజీరియన్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్సై రాజేందర్ గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకుని ఇంట్లో దాచాడు. అనంతరం ఆ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించాడు.
రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి.. రూ.80 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు రాజేందర్‌ను అప్పగించారు. రాజేందర్‌పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. గతంలోనూ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో రాజేందర్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అనిశాకు పట్టుబడి ఆ కేసులో సస్పెండ్ అయ్యారు. అయితే హైకోర్టులో స్టే తెచ్చుకొని తిరిగి సైబర్ క్రైమ్‌లో ఎస్సైగా చేరారు.