thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 9:50 AM IST

ETV Bharat / Videos

Currency Notes On Singer Viral Video : కచేరీలో నోట్ల వర్షం.. సింగర్​పై లక్షల రూపాయలు.. ఆ డబ్బులతో ఏం చేస్తారంటే?

Currency Notes On Singer Viral Video : గుజరాత్‌కు చెందిన జానపద గాయని ఊర్వశీ రదాదియా కరెన్సీ నోట్లలో మునిగిపోయింది! స్టేజీ మీద ఆమె పాడుతున్నంతసేపు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. బకెట్లతో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. దీంతో ఆ వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రూ.లక్షలను గోశాల నిర్మాణం కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం.. గుజరాత్​లో ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది! గాల్లో ఎగిరిపడుతున్న 100, 200, 500 రూపాయల నోట్లను అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. తమ కుమారుడి వివాహం సందర్భంగా ఓ కుటుంబం ఈ పని చేసింది. ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది. మహేసాణా జిల్లా, కడీ తాలుకాలో డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. అక్కడే ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడటం వైరల్​ అయిన వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.