Virat Farewell Gift To Shakib Al Hasan : బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ భారత్‌తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లా మధ్య జరిగిన రెండో టెస్టు అతడికి భారత్‌తో చివరి మ్యాచ్. అయితే ఈ వేదికలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ షకిబ్‌కు ఓ ప్రత్యేక బహుమతి అందించాడు. ఇరు జట్ల ఆటగాళ్లు మాట్లాడుకుంటున్న సమయంలో షకిబ్ దగ్గరకు వెళ్లి తాను సైన్ చేసిన బ్యాట్‌ను అతడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) October 1, 2024
చివరి టెస్టు ఆట డౌటే!
ఇటీవల టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షకిబ్, రానున్న ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డే క్రికెట్‌కు చెప్పనున్నట్లు తెలిపాడు. తన సొంత మైదానం మీర్పూర్‌లో చివరి టెస్టు ఆడాలనుకుంటున్నాడు. దీనికి బీసీబీ అంగీకరించిందంటూ షకీబ్ వెల్లడించాడు.
ఇటీవలే బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో దేశం తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా షకీబ్ నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో 37 ఏళ్ల 181 రోజుల వయసులో షకీబ్ శనివారం మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహ్మద్ రఫీక్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. రఫీక్ 2008లో 37 ఏళ్ల 180 రోజుల వయసులో బంగ్లా తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌కు ప్లేయర్ విల్‌ఫ్రెడ్ రోడ్స్ 1930లో 52 ఏళ్ల 165 రోజుల వయసులో చివరి టెస్టు ఆడిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
అయితే షకీబ్ ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో 4575 పరుగులు చేసి, 242 వికెట్లు తీశాడు. మరో 8 వికెట్లు పడగొడితే 250 మైలురాయి అందుకుంటాడు. 2007లో టెస్టు అరంగేట్రం చేసిన షకీబ్ ఒకటిన్నర దశాబ్దానికిపైగా బంగ్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో బంగ్లా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
'అతడి భద్రత మాకు సంబంధించినది కాదు' - షకిబ్‌కు షాకిచ్చిన బీసీబీ - BCB ON SHAKIB AL HASAN SECURITY
షకీబ్ అరుదైన రికార్డు - బంగ్లా నుంచి ఏకైక ప్లేయర్‌గా ఘనత - Shakib Al Hasan Test Record