పింఛను కోసం ఓ పండుటాకు అవస్థ - బురద దారిలో 2 కి.మీ. దేకుతూ వెళ్లిన వృద్ధురాలు - Old Woman Crawls 2 Km For Pension - OLD WOMAN CRAWLS 2 KM FOR PENSION
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2024, 8:45 AM IST
Old Woman Crawls 2 Km To Collect Pension In Odisha : ఒడిశా ప్రభుత్వం నెలనెలా పంపిణీ చేసే వృద్ధాప్య పింఛను కోసం 70ఏళ్ల వృద్ధురాలు పడిన అవస్థ వర్ణణాతీం. బురద దారిలో ఏకంగా 2 కిలోమీటర్లు దేకుతూ వెళ్లిన ఉదంతం సీఎం మోహన్ చరణ్ మాఝి సొంత జిల్లా కేంఝర్‌లో జరగడం గమనార్హం. తెల్కొయి సమితి రాయిసువా గ్రామానికి చెందిన పాధురి దేహురి నడవలేని స్థితిలో ఉన్నారు. పింఛను కోసం మట్టిదారిపై దేకుతూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తెల్కొయి సమితి అభివృద్ధి అధికారి గీతాముర్ము మాట్లాడుతూ, 'పంచాయతీ కార్యాలయానికి చేరుకోలేని లబ్ధిదారులకు నేరుగా పింఛను అందించాలని పీఈవోలకు గతంలోనే దిశానిర్దేశం చేశాం' అని అన్నారు. వృద్ధురాలి బ్యాంకు ఖాతాలో ఇది వరకే పింఛను జమ చేసినట్లు చెప్పారు. అయితే పంచాయతీ కార్యాలయానికి రావాలంటూ పీఈవో సూచించడంతో తాను వెళ్లాల్సి వచ్చిందని వృద్ధురాలు వాపోయారు.