ఐఫోన్ 16 కోసం ఎగ‌బ‌డ్డ జ‌నం - యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ - వీడియో చూశారా? - iPhone 16 Series Sales in India - IPHONE 16 SERIES SALES IN INDIA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 12:48 PM IST

iPhone 16 Series Sales in India : ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ సాంకేతికత త‌ర‌హాలో యాపిల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో శ‌క్తిమంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు యాపిల్‌ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రయాలు ప్రారంభం కాకముందు నుంచే స్టోర్లు ఎదుట లైన్​లో నిలబడి మరీ నిరీక్షించారు. ముంబయి, దిల్లీ సహా దేశంలోని వేర్వేరు నగరాల్లోని యాపిల్‌ స్టోర్స్, పెద్ద మాల్స్‌ బయట జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. యాపిల్ స్టోర్ సిబ్బంది తలుపులు తీసి లోపలకు ఆహ్వానించగానే వినియోగదారులు ఒక్కసారిగా​ ఎగబడ్డారు. ఆనందంగా స్టోర్లలోకి వెళ్లి సరికొత్త మోడల్ ఐఫోన్‌లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 'యాపిల్ క్రేజ్' ఇలా ఉంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.