Crane Role in Ganesh Immersion : గణేశ్ నిమజ్జనానికి వాడే క్రేన్స్ ఎలా ఉపయోగిస్తారు.. వారు తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలుసా..?
Published : Sep 28, 2023, 7:42 PM IST
Crane Role in Ganesh Immersion : హైదరాబాద్‌లోని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమాసుతుడిని నిమజ్జనం చేయడానికి క్రేన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. భారీ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయడానికి క్రేన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో, ఎంత సామర్థ్యంతో గణేశుడిని నిమజ్జనం చేస్తాయో పెద్దగా ఎవరికి తెలియదు. విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వాటి బరువు కొలవడానికి ఎలాంటి స్టేప్స్ తీసుకుంటారు. ఆ క్రేన్ విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుటు వెయిట్ ఎలా కంట్రోల్ చేస్తారు.
ముఖ్యంగా ఖైరతాబాద్ లాంటి బడా గణపతులను నిమజ్జనం చేసేందుకు చాలా పెద్ద క్రేన్స్ వాడుతుంటారు. మిగత వాటితో పోల్చితే వీటి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. వెయిట్ కంట్రోల్ కోసం అదనంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా గణేశ్ నిమజ్జనం చేసేముందు... ఆ విగ్రహం బరువు, ఎత్తును బట్టి... దాన్ని ఎంత దూరంలో వేయాలి, ఎంత ఎత్తు పైకి ఎత్తాలి అన్న అంశాలను ముందుగా పరిగణినలోకి తీసుకుని నిమజ్జనం చేస్తారు. బడా గణుపతులను నిమజ్జనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న క్రేన్స్ గురించి మా ప్రతినిధి అనూష మరిన్ని విషయాలు తెలియజేస్తారు.