CPI Narayana on Cable Bridge Quality : 'బ్రిడ్జిలు, కల్వర్టులు బీఆర్ఎస్ కూలిపోవడానికి ప్రకృతి ఇస్తున్న సంకేతాలు' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 3:36 PM IST

CPI Narayana on Cable Bridge Quality : కూలిపోతున్న బ్రిడ్జిలు, కల్వర్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రకృతి ఇస్తున్న సంకేతమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కరీంనగర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై నాణ్యతా లోపం కారణంగా తారు లేచిపోతుండటంతో గుత్తేదారు మరమ్మతులు చేపట్టారు. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలనకు వెళుతూ.. ఆయన సీపీఐ కార్యవర్గసభ్యులు చాడా వెంకట్‌రెడ్డితో కలిసి కరీంనగర్ కేబుల్‌ బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులను పరిశీలించడానికి వచ్చి బ్రిడ్జిపై నిలబడితేనే అదురుతున్నట్లు అనిపిస్తోందన్నారు. సుందరీకరణ పేరుతో హడావుడి నిర్మాణాలు చేపట్టడం వల్ల నాణ్యత కొరవడిందని ఆయన ఆరోపించారు. 

CPI Narayana Latest Comments : అందాల సాకుతో తెల్ల వెంట్రుకలకు రంగు వేసి ఎలా నల్లగా మార్చారో ఇప్పుడు ఈ బ్రిడ్జి పరిస్థితి అలాగే ఉందని విమర్శించారు. పైన వేసిన రంగు వెలిసిపోవడంతో అసలు రంగు బయటపడినట్లు అయిందన్న నారాయణ.. హైదరాబాద్‌, కరీంనగర్‌లో హ్యాంగింగ్ బ్రిడ్జి నిర్మించామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని ఆయన విమర్శించారు. ఇక్కడ నీళ్లు నిలబడాలంటే చెక్‌డ్యాములు గట్టిగా ఉండాలని.. ఆ చెక్‌డ్యాములే ఒక్క వర్షానికి కొట్టుకు పోయాయన్నారు. ఇందులో డబ్బు దండుకోవాలన్న దుర్బుద్ధి తప్ప మరొకటి కనపడలేదని ఆయన విమర్శించారు. 

CPI Narayana Comments on Telangana Government : కలల ప్రపంచం కాదిది కన్నీళ్ల ప్రపంచమన్న నారాయణ.. అందాల బ్రిడ్జి కాదిది అడ్డగోలుగా దోచుకున్న బ్రిడ్జిగా అభివర్ణించారు. ప్రకృతి చాలా బలమైనదని.. దేవున్ని నమ్మక పోయినా తాను ప్రకృతిని నమ్ముతానని అన్నారు. ఇక్కడ బ్రిడ్జిలు కల్వర్టులు కూలిపోతున్నాయంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం కూలి పోతుందని ప్రకృతి చెప్పకనే చెబుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణపు పనులపై లోతుగా విచారణ జరిపించాలని.. ఈ బ్రిడ్జి కూలిపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని నారాయణ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.