CPI Leader Narayana on Congress Alliance : "మాకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేస్తాం" - సీపీఐ నారాయణ కామెంట్స్ ఆన్ కేసీఆర్
🎬 Watch Now: Feature Video
Published : Oct 25, 2023, 6:57 PM IST
CPI Leader Narayana on Congress Alliance : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు సాగుతున్నట్లు సీపీఐ(cpi) జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా ఇచ్చిన స్థానాల్లో పోటీ చేస్తామని అన్నారు. సీపీఐ జాతీయ నాయకులతో కాంగ్రెస్ పార్టీ చర్చలు కొనసాగుతున్నాయని.. ఒక ఓసీ, ఒక బీసీ సీటుపై అవగాహన వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్(BRS)ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోదియాను మాత్రమే జైల్లో పెట్టారని.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.
CPI Leader Narayana Comments on BJP : బీఆర్ఎస్పై పోరాడుతున్న బండి సంజయ్‌ని అన్యాయంగా పదవి నుంచి తొలగించారని.. కవితను అరెస్ట్ చేస్తామని ఒంటి కాలిపై లేచిన బండి సంజయ్ కాలు తెగ్గొట్టారని ఆయన వ్యంగంగా అన్నారు. బండి సంజయ్‌ని ఎందుకు బాధ్యతల నుంచి తొలగించారో సమాధానం చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నందునే అవినాష్ రెడ్డి బయట ఉన్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda Project) కుంగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కుంగిన ప్రాంతంతో పాటుమిడ్ మానేరుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సీపీఐ ప్రతినిధి బృందం గురువారం పరిశీలించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు.