CPI Leader Chada Venkat Reddy On Jamili Elections : 'తలకిందులుగా తపస్సు చేసినా జమిలి ఎన్నికలు వీలుకావు'
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 2:29 PM IST
CPI Leader Chada Venkat Reddy On Jamili Elections : ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపడం అనేది తలకిందులుగా తపస్సు చేసిన వీలుగాని అంశమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అనబెరి, సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. జమిలి ఎన్నికల విధానం అనేది దేశంలో పాత విధానమేనని, దీనిపై ప్రధాని మోదీ కమిటీని వేస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామనడం సరికాదన్నారు.
ఒకే దేశం, ఒకే పన్ను, ఓకే ఎన్నిక అన్న మోదీ పెట్రోల్ ఉత్పత్తులను పక్కదారి పట్టిస్తూ జీఎస్టీని అమలు చేయడం లేదా అని ప్రశ్నించారు. వాటిలో 70 శాతం కేంద్ర ప్రభుత్వమే దోచుకుంటుందని ఆరోపించారు. దేశంలో 25 పార్టీలు బీజేపీ హటావో దేశ్‌కి బచావో అనే నినాదంతో ముందుకు పోతున్నాయని తెలిపారు. గతంలో పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఏది చెప్పామో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పామన్నారు. పొత్తులో భాగంగా మేము అడిగిన ఐదు సీట్లు ఇవ్వకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉన్న 33 నియోజకవర్గాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు.