గోవులతో తొక్కించుకున్న భక్తులు- 'అబద్ధాలు చెప్పేవారిపై అలా'! - విచిత్రంగా దీపావళి వేడుకలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 6:02 PM IST
Cows Runs Over Devotees Ujjain : గోమాతలను దైవంగా భావిస్తుంటారు భారతీయులు. వాటికి పూజలు చేస్తారు కొందరు. అయితే మధ్యప్రదేశ్.. ఉజ్జయినిలోని భిదావత్ గ్రామంలో భక్తులు నేలపై పడుకుని గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని అన్నారు. అంతేగాక గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని.. అందుకే నేలపై పడుకుని గోవులతో తొక్కించుటామని పురుష భక్తులు చెబుతున్నారు.
ఇదీ సంప్రదాయం..
దీపావళి తర్వాత రోజు ఉదయం గ్రామస్థులు గోవులకు పూజలు చేశారు. ఆ తర్వాత గోవులను ఒకేచోట ఉంచారు. డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత పురుష భక్తులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. గోవులు.. భక్తులను తొక్కిన తర్వాత భక్తుల లేచి నిలబడి.. డప్పులకు తగ్గట్లు నృత్యం చేశారు. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు ప్రజలు భారీగా భిదావత్ గ్రామానికి భారీగా తరలివచ్చారు.
"భక్తులు దీపావళికి ముందు ఐదు రోజుల నుంచి ఉపవాసం ఉంటారు. దీపావళికి ముందు రోజు రాత్రి వారంతా మాతా భవానీ ఆలయంలో ఉంటారు. భజనలు చేస్తారు. ఆ తర్వాత రోజు నేలపై పడుకుంటే ఆవులు తొక్కుతాయి. అబద్ధం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని నమ్ముతాం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా మా గ్రామంలో ఉంది." అని బిధావత్ గ్రామస్థుడు ఒకరు తెలిపారు.