Cow Dung Ganesh Idols Nirmal 2023 : పర్యావరణాన్ని కాపాడే.. గోమయ గణపయ్యను చూసొద్దామా..?
🎬 Watch Now: Feature Video
Published : Sep 18, 2023, 11:32 AM IST
Cow Dung Ganesh Idols Nirmal 2023 : వినాయక నవరాత్రుల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. గోమయంతో విగ్రహాలు(Ganesh Idols) తయారు చేయడం ఓ కళ. అది మరుగున పడిందని గుర్తించి దాన్ని సంరక్షించేందుకు క్లిమాం ఆధ్వర్యంలో ప్రయత్నిస్తున్నామని సంస్థ నిర్వాహకురాలు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు అల్లోల దివ్యారెడ్డి అన్నారు.
Ganesh Chaturthi Telangana 2023 : నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిదేళ్లుగా తమ క్లిమాం గోశాల ఆధ్వర్యంలో గోమయ గణపతులు తయారు చేసి ఐకేఆర్ ట్రస్ట్(IKR Trust) ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అల్లోల దివ్యారెడ్డి(Allola Divya Reddy) తెలిపారు. 2016లో 20 వినాయకులతో ప్రారంభించి.. ఇప్పుడు వందల సంఖ్యలో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడున్నర అడుగుల పరిమాణంలో 400 విగ్రహాలు సిద్ధం చేసామని, 30 మంది కళాకారులు దాదాపు ఆరు నెలలుగా తయారీలో పాల్గొన్నారన్నారు. అందరూ గోమయ, మట్టి గణపతులు(Clay Ganesh Idols 2023) ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.