Congress War Room in Hyderabad : తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'వార్ రూమ్'లో కాంగ్రెస్ సన్నాహాలు - కాంగ్రెస్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 12, 2023, 1:24 PM IST
Congress War Room in Hyderabad : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్.. తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఇందిరాభవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ఎన్నికల వేళ కార్యకర్తలను, నాయకత్వాన్ని వెనకుండి నడిపించేందుకు.. ఈ వార్ రూమ్ కేంద్రంగా పార్టీ విధానపరమైన నిర్ణయాలు జరగనున్నాయి. ఎన్నికల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలపై వెనువెంటనే నివేదిక చేయనుంది.
Congress Strategy For Telangana Assembly Election 2023 : ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరిగే పరిస్థితిలపై వార్ రూమ్ నిరంతరం నిఘా పెట్టనుంది. అదేవిధంగా బూత్‌స్థాయిలో రోజువారీగా జరిగే కార్యక్రమాలపై విశ్లేషిస్తుంది. ఎన్నికల బరిలో ఉండే నాయకులకు, ప్రచార కమిటీకి, పీసీసీ, సీఎల్పీలకు ఇక్కడ నుంచే అవసరమైన సమాచారాన్ని అందించనుంది. వార్ రూమ్ పనితీరుపై.. తెరవెనక నుంచి నడిపించే ఈ కేంద్రంలో ఎవరెవరుంటారు. వారంతా ఏం చేస్తుంటారనే విషయాలను హైదరాబాద్ గాంధీభవన్ నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కోఆర్డినేటర్ మల్లు రవితో ముఖాముఖి..