కాంగ్రెస్​పై కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు - బీఆర్ఎస్ బీజేపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 10:30 PM IST

Congress Leaders Complaint to DGP : ప్రజామోదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సదరు విషయాన్ని డీజీపీ రవిగుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నరంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 

Congress Leaders Complaint on BRS and BJP Leaders : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యంను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమన్నారు. ఈ విషయమై డీజీపీ రవి గుప్తాకు వినతిపత్రం ఇచ్చామని లోతుగా అధ్యయనం చేయాలని కోరినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా తిప్పికొడుతుందన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.