రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే సబ్బండ వర్గాలకు మేలు : హనుమంతరావు
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 9:47 PM IST
|Updated : Dec 8, 2023, 6:39 AM IST
Congress Leader Hanumanth Rao Interview : తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సబ్బండ వర్గాలు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో లేదని అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన యువతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని మండి పడ్డారు.
రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ను కాంగ్రెస్లో వీలినం చేస్తానని మాట ఇచ్చి తప్పారని హనుమంతరావు ఆరోపణలు చేశారు. ఆ పదేళ్లలో కేసీఆర్ యువతకు తీవ్రమైన నష్టం చేశారని, ఏ ఒక్క హామీని సరిగ్గా నిర్వర్తించలేదని ప్రజలు గ్రహించారు అందుకే బీఆర్ఎస్ ఓటమిని చవి చూసిందన్నారు. ఆంధ్రాలో ప్రజా వ్యతిరేకత వస్తదని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఆరు గ్యారెంటీలు, రేవంత్ రెడ్డి వాక్ చాతుర్యం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలన్నీ తోడైనందునే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుప్పకూలిందంటున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో ఈటీవీ భారత్తో ముఖాముఖి నిర్వహించారు.