Congress Cold War In Wardhannapet : వర్ధన్నపేటలో కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు - నమిండ్ల శ్రీనివాస్ కేఆర్ నాగరాజుల కోల్డ్‌వార్
🎬 Watch Now: Feature Video
Published : Aug 29, 2023, 5:40 PM IST
Congress Cold War In Wardhannapet : వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగిన వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఇరువురు టికెట్ ఆశిస్తుండగా వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నేడు ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో అది బహిర్గతమైంది. ఒకరిని మించి మరొకరు బల ప్రదర్శన చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడంతో నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.
Class War Led To The Discussion : వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఇరువురు నేతల మధ్య భారీ బల ప్రదర్శన జరిగింది. అనంతరం సభా ప్రాంగణానికి చేరున్నారు. సమావేశంలో నేతలు నమిండ్ల శ్రీనివాసులును వేదికపైకి ఆహ్వానించి, నాగరాజును ఆహ్వానించకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో సభా ప్రాంగణం గందరగోళంగా మారింది. కార్యకర్తల ఆందోళనలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజును కూడా వేదిక పైకి ఆహ్వానించారు. ఇరు వర్గాల పోరు, బలప్రదర్శన పార్టీలో చర్చనీయాంశంగా మారింది.