Common Man Protest Against CBN Arrest అభిమాని కలత చెందిన వేళ..! అరగుండుతో గిద్దలూరు నుంచి రాజమండ్రికి..! అధైర్యపడొద్దన్న భువనేశ్వరీ - చంద్రబాబు అరెస్టు
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2023, 3:51 PM IST
Common Man Protest Against CBN Arrest రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన నేపథ్యంలో... సామాన్యులు సైతం ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. తమ సొంత పనులు వదులుకుని రాజమహేంద్రవరానికి క్యూ కడుతున్నారు. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు సతీమణి మాట్లాడుతూ.. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, కార్యకర్తలు అధైర్య పడొద్దని చెప్తున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో పార్టీ శ్రేణులెవ్వరూ అధైర్యపడొద్దని నారా భువనేశ్వరి కోరారు. జైల్లో ఉన్నా కార్యకర్తల బాగు కోసమే చంద్రబాబు పరితపిస్తున్నారని ఆమె తెలిపారు. ఏ తప్పు చేయని చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని కార్యకర్తలతో భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) ను ఖండిస్తూ అరగుండు నిరసనతో అహ్మద్ బాషా గిద్దలూరు నుంచి రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా అహ్మద్ బాషా సహా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఇతర కార్యకర్తలను నారా భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు రోజు నుంచి ఎంతో కలత చెంది ఉన్నానని అహ్మద్ బాషా తెలిపారు. చిరు వ్యాపారస్థుడునైన తాను... వ్యాపారం వదిలి చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. చంద్రబాబు బయటకు వస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయన్న అహ్మద్ బాషా... ఆయన బయటకు వచ్చే వరకూ అరగుండుతోనే రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు.