ఇలాంటి డ్రెస్ వేసుకున్నందుకు రూ.లక్షలు బహుమతి- ఎందుకో తెలుసా? - కామిక్ కాన్ బెంగళూరు
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2023, 6:38 PM IST
Comic Con 2023 Bangalore : సాధారణ వ్యక్తులు.. సూపర్ హీరోల్లా మారిపోయారు. సినిమాలు, కామిక్ బుక్స్, వీడియో గేమ్స్‌లోని తమకు ఇష్టమైన క్యారెక్టర్స్‌లా చిత్రవిచిత్రమైన డ్రెస్‌లు వేసుకుని రోజంతా మురిసిపోయారు. కామిక్ ప్రియులంతా ఇలా ఒకే చోట చేరి, తమలోని సృజనాత్మకతను బయటపెట్టుకునేందుకు వేదికైంది బెంగళూరు కామిక్ కాన్. వైట్‌ఫీల్డ్‌లోని కేటీపీఓ ట్రేడ్ సెంటర్లో 3 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి వందలాది మంది కాస్ ప్లేయర్లు హాజరయ్యారు. బ్యాట్‌మ్యాన్, వండర్ ఉమన్, మారియో వంటి పాత్రల వేషధారణలో సందడి చేశారు. వివిధ విభాగాల్లో సత్తా చాటి.. 'కామిక్ కాన్ ఇండియా' సంస్థ ఇచ్చే లక్షల రూపాయల నగదు బహుమతుల్ని సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. ఈ సూపర్ హీరోల కాస్ట్యూమ్స్ అన్నింటినీ.. అభిమానులే సొంతంగా తయారు చేసుకోవడం విశేషం. ఇందుకోసం తాము 3-4 నెలలు కష్టపడి, అనేక వేల రూపాయల ఖర్చు చేశామని కొందరు కామిక్ ఫ్యాన్స్ చెప్పారు.