రోడ్లపై నిలబడి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వీక్షణం - భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లలో - సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు
🎬 Watch Now: Feature Video
Published : Dec 7, 2023, 11:07 PM IST
|Updated : Dec 8, 2023, 6:14 AM IST
CM Revanth Reddy Oath Ceremony : హైదరాబాద్లో ఎల్బీస్టేడియంలోని సీఎం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర నలుమూలాల నుంచి వేలాది మంది తరలిరావడంతో స్టేడియం పరిసరాలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో సీఎం ప్రమాణ స్వీకారాన్ని అందరూ వీక్షీంచేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాట్లు చేశారు. దీంతో స్టేడియంలోకి వెళ్లనివారు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పెద్ద ఎత్తున ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా తిలకించారు. ఈ క్రమంలోనే స్టేడియం చూట్టు పరిసరాల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Heavy Traffic Jam at LB stadium : దీంతో స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రముఖులు సైతం ఇబ్బందులు పడ్డారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ సహా పలువురు ముఖ్యనాయకులు వారి వాహనం నుంచి దిగి స్టేడియానికి నడిచి వెళ్లారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలును సైతం పోలీసులు అదుపు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. ముందస్తుగానే అంచనా ప్రకారం అడుగడునా బారికేడ్లు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలను నియంత్రించలేకపోయారు.