సీఎంపై ఎంత అభిమానమో - బియ్యం గింజలతో రేవంత్ రెడ్డి చిత్రపటం - బియ్యం గింజలతో రేవంత్ రెడ్డి డ్రాయింగ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-12-2023/640-480-20281022-thumbnail-16x9-revanth-art-with-rice.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 16, 2023, 11:21 AM IST
CM Revanth Reddy Art Made of Rice grains : రాష్ట్ర ముఖ్యమంత్రిపై అభిమానంతో ఓ కాంట్రాక్టు డ్రాయింగ్ టీచర్ బియ్యపు గింజలతో రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని రూపొందించాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ సర్వ శిక్షా అభియాన్ కింద ఎల్కతుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు. 10 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే చాలీచాలని జీతంతో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అక్కడ కాంట్రాక్టు బేస్డ్గా పని చేస్తున్న వారంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆకాంక్షించారు. సీఎంపై అభిమానంతో బియ్యపు గింజలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించానని రాజ్ కుమార్ తెలిపారు. గతంలోనూ ఎందరో మహనీయుల, ప్రముఖుల చిత్రపటాలను ఇదే విధంగా రూపొందించానని పేర్కొన్నారు. రాజ్ కుమార్ రూపొందించిన చిత్రపటాన్ని పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులతో పాటు అందరినీ ఆకర్షిస్తోంది.