CM KCR's Wife Shobha Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్ సతీమణి శోభ.. స్వామివారికి తలనీలాలు సమర్పణ - టీటీడీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2023, 10:53 AM IST
CM KCR's Wife Shobha Visits Tirumala : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు ఆమెకు ఆహ్వానం పలికారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శోభ.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. టీటీడీ అధికారి రామకృష్ణ ఆమెకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం కల్వకుంట్ల శోభ తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. తెల్లవారుజామున స్వామివారి అర్చన సేవలో పాల్గొన్నారు.
అంతకుముందు ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో కేసీఆర్ సతీమణికి పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. మరోవైపు తిరుపతి దేవ స్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.