బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు - తెలంగాణలో మాత్రం నీటి పన్ను లేదు : కేసీఆర్​ - డోర్నకల్​ బీఆర్​ఎస్​ ఆశీర్వాద సభ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2023, 5:02 PM IST

CM KCR BRS Public Meeting at Dornakal : బీజేపీ, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు ఉన్నాయని.. తెలంగాణలో మాత్రం నీటి పన్నులు లేవని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్​ ఇస్తున్నామని పేర్కొన్నారు. 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొంటున్నామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్​ రాజ్యంలో ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. బీఆర్​ఎస్​ పాలనలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు. 

Telangana Election 2023 : కాంగ్రెస్​ నాయకులు రైతుబంధు దుబారానని ఆరోపణలు చేస్తున్నారు.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని మండిపడ్డారు. ఈ పోర్టల్​తో ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజల చేతిలో పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో 3500 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని.. డోర్నకల్​లోనే 82 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.