తెలంగాణలో అధికారంలోకి వస్తాం - ప్రజాపాలన అందిస్తాం : భట్టి విక్రమార్క
🎬 Watch Now: Feature Video
Published : Nov 18, 2023, 11:14 AM IST
|Updated : Nov 18, 2023, 12:17 PM IST
CLP Bhatti Vikramarka Interview : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతోందని.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని.. ఈ సారి 74 నుంచి 78 స్థానాలతో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజాపాలన అందించడం ఖాయమని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు పార్టీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. వారి నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు.
ఉచిత విద్యుత్తు పేటెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. కాంగ్రెస్ తెచ్చిన విద్యుత్తు ప్రాజెక్టులతోనే బీఆర్ఎస్ సర్కారు కరెంటు అందిస్తుందని భట్టి అన్నారు. బీఆర్ఎస్లో నియంతలా కేసీఆర్ ఒక్కరే ఉన్నారని.. కాంగ్రెస్లో మాత్రం సీఎం పదవికి అర్హులైన నాయకులు చాలామంది ఉన్నారని తెలిపారు. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని.. అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన అందిస్తామంటున్న మల్లు భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.