BRS MEETING: బీఆర్ఎస్ సభ నుంచి గోడ దూకి వెళ్లిపోయిన జనం.. ఎక్కడంటే? - సూర్యాపేటలో మీటింగ్ నుంచి ఎందుకు వెళ్లిపోయారు
🎬 Watch Now: Feature Video
BRS spiritual gathering in Suryapet: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి వచ్చిన ప్రజలను బయటకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు, ప్రజలకు వాగ్వాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అధికార పార్టీ కార్యకర్తలతో కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు వచ్చిన ప్రజల్లో కొందరు మధ్యలోనే బయటకు వెళ్లాలని భావించారు. వారు బయటకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించారు. ఎవరూ వెళ్లకుండా గేట్లను మూసివేశారు. దీంతో గేటు దగ్గర ప్రజలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన జనం ఒక్కసారిగా గేట్లను తీసుకొని బయటపడ్డారు. మరికొంత మంది గోడదూకి బయటకి వెళ్లిపోయారు. సభలో పోలీసులు ప్రజలపై ప్రవర్తించిన తీరు పలు ప్రశ్నలకి దారితీస్తోంది. పోలీసులు ఇలా ఎందుకు ప్రవర్తించారని సమావేశానికి వచ్చిన ప్రజలు ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై పోలీసులు మాత్రం నోరు విప్పలేదు.