పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన రేగా కాంతారావు - అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు - రెగా కాంతారావు వాగ్వాదం న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 8:10 PM IST

Clash at Bhadradri Kothagudem Polling Station : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో జిల్లా పరిషత్ పాఠశాలలో 62 నుంచి 71 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ సమయం ముగిసే సమయంలో బీఆర్​ఎస్​ అభ్యర్ధి రేగా కాంతారావు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేసి కాంతారావుని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకొంది.
Clash between BRS Candidate Congress Leaders : రేగా అనుచరులు కూడా ఆయనతో పాటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సీఆర్పీఫ్ పోలీసులు కాంతారావుని లోపలికి వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లోనికి వెళ్లేందుకు యత్నించడంతో.. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త పరుగెత్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో కాలు విరిగింది.

Kantha Rao Reacted To The Clash : ఈ ఘటనపై రేగా కాంతారావు స్పందించారు. అభ్యర్థిగా తాను ఎందుకు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ప్రశ్నించారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిల్లర నాయకులు నా వెంట పడ్డారని. పోలింగ్ కేంద్రంలోకి బయటికి వచ్చే క్రమంలో వారు రాళ్లదాడికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అప్పటికే తన కారుపై రాళ్లు విసిరారని ఆరోపించారు. జరిగిన ఘటనపై పోలీసులతో పాటు, దాడికి యత్నించిన వారిపై జిల్లా ఎస్పీకి, ఎన్నికల కమిషన్​కి ఫిర్యాదు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.