కరీంనగర్లో చిట్‌ఫండ్ స్కాం బోర్డు తిప్పేసిన యజమాని, ఆందోళనకు దిగిన బాధితులు - కరీంనగర్లో చిట్‌ఫండ్స్ బాధితుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 10:51 PM IST
Chit Fund Victims Protest in Karimnagar : రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా జమ చేసి చిట్‌ఫండ్‌లో డిపాజిట్ చేస్తే.. యజమానులు తమ డబ్బులు ఇవ్వడం లేదంటూ కరీంనగర్లో చిట్టి బాధితులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్‌లోని అక్షర చిట్‌ఫండ్స్ యాజమాన్యం బోర్డు తిప్పేయడంతో.. బాధితులు కరీంనగర్‌లోని చిట్స్ రిజిస్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Akshara Chitfund Scam in Karimnagar : అక్షర చిట్ ఫండ్స్ యజమాని పేరాల శ్రీనివాసరావు కరీంనగర్‌లోని రిజిస్టర్ చిట్స్ కార్యాలయానికి వచ్చాడని తెలియడంతో.. చిట్స్ బాధితులు రిజిస్టర్ కార్యవర్గానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని అక్షర చిట్‌ఫండ్స్ యజమాని పేరాల శ్రీనివాసరావును నిలదీశారు. తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనను విరమింప చేశారు. చివరకు చిట్స్ యజమాని.. బాధితులకు డిసెంబర్ 31న ఎవరి డబ్బులు వారికి ఇస్తానని తెల్ల కాగితంపై రాసి ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.