Chandrababu Followers Rally in LB Nagar : 'చంద్రబాబును విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగుతాయి' - వనస్థలిపురంలో టీడీపీ ధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 10:02 PM IST

Chandrababu Followers Rally at LB Nagar in Hyderabad : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్​కు నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం(Vanasthalipuram)లోని ఎన్టీఆర్​ చౌరస్తా(పనామా కూడలి) వద్ద చంద్రబాబు మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. 'సైకో జగన్ పోవాలి సైకిల్ బాబు రావాలి' అంటూ నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శనలో వనస్థలిపురం పరిసరప్రాంత కాలనీవాసులు, ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీలకు అతీతంగా కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.  

Chandrababu Followers Darna at Panama : భారీగా ఆందోళనకారులు రోడ్డుపైకి రావడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్​కి అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఆందోళన కారులను చెదరకొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబును విడుదల చేసే వరకు వారి ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.