Chandrababu Family Members Reached Tadepalli Sit Office తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు.. ఇంకా అనుమతించని పోలీసులు - Chandrababu Family Members news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-09-2023/640-480-19472904-thumbnail-16x9-cbn-family.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Sep 9, 2023, 9:24 PM IST
Chandrababu Family Members Reached Tadepalli Sit Office: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు తాడేపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. యువనేత నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిలు చంద్రబాబును కలిసేందుకు సిట్ కార్యాలయానికి విచ్చేశారు. అయితే, సీఐడీ అధికారులు.. చంద్రబాబును కలిసేందుకు ఇంకా అనుమతించలేదు. లోకేశ్, భువనేశ్వరిలను నాలుగో ఫ్లోర్‌లో కూర్చోబెట్టారు. ఐదో ఫ్లోర్‌లో చంద్రబాబు నాయుడిని గత మూడు గంటలుగా సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Nandamuri Balakrishna comments: మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..''16 నెలలు జైల్లో ఉన్న జగన్.. కనీసం 16 నిమిషాలైన చంద్రబాబును జైల్లో పెట్టాలని లక్ష్యంగా కక్ష సాధిస్తున్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అధారాలు లేకుండా.. చంద్రబాబును అరెస్టు చేశారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్ ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింబచేసినప్పుడు.. కోర్టు చివాట్లు పెట్టిన సంగతి వాస్తవం కాదా..?. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్రే. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.'' అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి.. ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో ఉంచాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలను కోరారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబం కోసం పోరాటం చేయటంలేదని.. ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నారని నారా భువనేశ్వరి తెలిపారు.