Chandrababu Bail Celebrations : బాబు విడుదలపై.. టీడీపీ శ్రేణుల సంబురాలు - చంద్రబాబు తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2023, 10:54 PM IST

Chandrababu Bail Celebrations : స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంపై.. టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజమండ్రి జైలు నుంచి బాబు విడుదల సందర్భంగా.. లాకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. 

CBN got Bail : సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో.. చంద్రబాబు విడుదల అయ్యినందుకు గాను బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కోకాపేట్‌ మూవీ టవర్స్‌, కూకట్​పల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన సందర్భంగా టీడీపీ మద్దతుదారులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. నిజం గెలిచిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కడిగిన ముత్యంలా తమ నాయకుడు బయటకు వచ్చారని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.