బైక్​పై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఒళ్లు గగుర్పొడిచేలా ప్రమాద దృశ్యాలు - Road accident at Pedpadalli Manthani flyover

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 10, 2023, 5:54 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

Manthani Road Accident CCTV Footage: పెద్దపల్లి జిల్లా మంథని ఫ్లైఓవర్‌ వంతెన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యభర్తలు పెద్దపల్లి వైపు వస్తుండగా మలుపు వద్ద వెనక నుంచి వస్తున్న లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు లారీ చక్రాల కింద నలిగిపోయారు. గొల్లపల్లికి చెందిన రమేష్ తన భార్య స్వరూపతో కలిసి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమేష్​ రెండు కాళ్లు నుజ్జునుజ్జు కాగా స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. రమేష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.