CBI Court Dismissed Sivashankar Reddy Bail Petition: వివేకా హత్య కేసు..శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత - Viveka murder case updates
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 8:52 PM IST
CBI Court Dismissed Sivashankar Reddy Bail Petition: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వివేక హత్య కేసులో అరెస్టై జైళ్లో ఉన్న A-5 శివశంకర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలంటూ..హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
మరోవైపు ఇదే కేసులో జైళ్లో ఉన్న కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. అనారోగ్యం కారణంగా 15రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. గతవారం కోర్టులో ఇరువైపుల వాదనలు జరిగాయి. అనారోగ్యం కారణంతో బెయిల్ ఇవ్వొద్దని.. చంచల్‌గూడ జైల్లో వైద్యులు.. తగిన చికిత్స అందిస్తున్నారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.