పాదచారిని ఢీకొట్టి 200 మీటర్లు లాక్కెళ్లిన కారు.. చికిత్స పొందుతూ యాచకుడు మృతి - రాజస్థాన్ మీరట్‌లో యాచకుడి పైకి దూసుకెళ్లిన కారు
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ ఉదయ్‌పుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘంటాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. పాదచారిపైకి దూసుకెళ్లింది. బాధితుడి పైనుంచి వెళ్లిన కారు.. అతడిని 200 మీటర్ల వరకు లాక్కెళ్లింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఫిబ్రవరి 4న ఈ ఘటన జరిగిందని ఘంటఘర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కైలాశ్ చంద్ర తెలిపారు. మృతుడిని హేమరాజ్ మేఘవాల్గా గుర్తించారు. అతడు స్థానికంగా యాచిస్తూ జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
'ఆల్టో కారులో వెళ్తున్న వ్యక్తి.. పాదచారిని వేగంగా ఢీకొట్టాడు. బాధితుడు కారు కింద ఇరుక్కుపోయాడు. ఇది గమనించని ఆల్టో డ్రైవర్.. 200 మీటర్ల వరకు వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. స్థానికులు గమనించి మాకు సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించాం' అని తెలిపారు. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారని హేమరాజ్ కుటుంబ సభ్యురాలైన మంగీ బాయి తెలిపారు.